కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కలిసి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి నిధులు కావాలని వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లో సమస్యలపై పరిష్కారమే ధ్యేయంగా స్థానిక కార్పొరేటర్లు తో కలిసి గత నెల రోజులుగా నియోజకవర్గం లోని అన్ని డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్లతో కలిసి పాదయాత్ర చేశారు..దానిలో ప్రధానంగా కాలనీలలోని సమస్యలను.. మంచినీటి సమస్యలను స్థానికులను అసోసియేషన్ సభ్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రతి డివిజన్లో రోడ్ల, డ్రైనేజీ సమస్యలు మంచినీటి సమస్యలు ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వినతి పత్రం అందచేశారు. కూకట్ పల్లి సర్కిల్ రూ.1059 .30 లక్షల నిధులు & మూసాపేట్ సర్కిల్ రూ.3490 . 50 లక్షల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్ ను కోరారు.