కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ కు చెందిన మచ్చ నరేష్ S/o మచ్చ బాలమైసయ్య,(32) బ్రెయిన్ స్టోక్ వలన పెరిలాసిస్ రావడం తో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి సోదరుడు సురేష్ కూకట్పల్లి లోని గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR)గారి కార్యాలయంలో సంప్రదించగా GVR గారు బండి రమేష్ గారి ద్వారా ముఖ్యమంత్రి సహానిది కి దరఖాస్తు చేయించడం జరిగింది. ప్రభుత్వ పెద్దల సహకారంతో వారికి LOC ద్వారా 1లక్ష 50 వేల రూపాయలు మంజూర్ చేయించడం జరిగింది..
ఆ లెటర్ ని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో TPCC ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ బండి రమేష్ గారి చేతుల మీదుగా వారి భార్య సౌజన్య మరియు వారి తల్లిగారు ముత్తమ్మ గార్లకు అందజేయడం జరిగింది..

ఈ సందర్భంగా వారి భార్య మరియు తల్లి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బండి రమేష్ గారికి, గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR)గారికి కృతజ్ఞతలు తెలియజేశారు…

About The Author