సొంత ఖర్చులతోనే లండన్‍కు సీఎం.
అమరావతి : నేటి నుంచి ఈనెల 5 వరకు సీఎం చంద్రబాబు, భువనమ్మ విదేశీ పర్యటన..! * రాత్రికి సతీసమేతంగా లండన్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు. * పలు అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ సొంత ఖర్చులతోనే లండన్‍కు సీఎం * ఈనెల 4న “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్” అవార్డు అందుకోనున్న నారా భువనేశ్వరి * ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు అవార్డు * భువనేశ్వరికి అవార్డు ప్రదానం చేయనున్న ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ * గతంలో అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా తదితరులకు ఈ అవార్డు ప్రదానం * హెరిటేజ్ ఫుడ్స్ కి గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రదానం * హెరిటేజ్ ఫుడ్స్ కి ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో అవార్డు * సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై అవార్డు అందుకోనున్న భువనేశ్వరి * కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు * వ్యక్తిగత పర్యటన అనంతరం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం * అక్కడి పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీకానున్న సీఎం * విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించనున్న సీఎం నవంబర్ 6న రాష్ట్రానికి తిరిగి రానున్న సీఎం చంద్రబాబు.

