Telugu

సబ్ధర్ నగర్‌లో 90 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనుల పర్యవేక్షణ

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ ఈ బ్లాక్‌లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు 90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వాడా, ప్రతి వీధి అభివృద్ధి దిశగా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు పనుల నాణ్యతను పరిశీలించి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నాగుల సత్యం, అబ్దుల్ హమీద్, అబ్దుల్ సలీం, షేక్ రఫిక్, మొహమ్మద్, బాబా, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply