Telugu

శ్రీ శ్రీ శ్రీ నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్ర ఆలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో శ్రీ శ్రీ శ్రీ నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్ర ఆలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యతిధిగా పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వేద పండితులు పూర్ణ కుంభముతో కూన శ్రీశైలం గౌడ్ గారికి ఘన స్వాగతం పలికారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ…

✅ కార్తీకమాసంలో ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్ర ఆలయం వారి ఆధ్వర్యంలో గాజులరామారంలో కోటి దీపోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారని కొనియాడారు..

✅ ఈ దైవ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చి వారి యొక్క భక్తిని చాటుకుంటారన్నారు..
ఈ కార్యక్రమంలో నకులేశ్వరి దేవి సిద్దిపేట నిర్వాహకులు నందు పంతులు వారి మిత్రబృందం మరియు యువజన కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బుచ్చిరెడ్డి, కూన రవీందర్ గౌడ్, మురళి గౌడ్, ప్రభు గౌడ్, దుగ్యాల ప్రసాద్, కూన రాఘవేంద్ర గౌడ్, రవి, వాస శ్రీనివాస్ గుప్తా, బిల్లా, భరత్, చిలుక,మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply