జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్బంగాబీఆర్‌ఎస్ పార్టీ ఆటో ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.
ఈ ర్యాలీలో మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్లు మరియు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆటో ర్యాలీ గోకుల్ థియేటర్ నుండి ప్రారంభమై, జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ పార్టీ భవన్ వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా నాయకులు ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
నాయకులు మాట్లాడుతూ —
“ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రగతిని కొనసాగించేందుకు బీఆర్‌ఎస్ పార్టీనే సరైన ఎంపిక” అని పిలుపునిచ్చారు.
అలాగే వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తెలిపారు —
“కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసింది. వాహన యజమానులకు ఇచ్చిన హామీలు ఎక్కడా నిలబెట్టుకోలేదు.
బీఆర్‌ఎస్ పాలనలో లభించిన సబ్సిడీలు, బెనిఫిట్స్ అన్నీ నిలిచిపోయాయి.
ఆటో డ్రైవర్ కుటుంబాలు మరోసారి ఆర్థిక కష్టాల్లోకి నెట్టబడ్డాయి.
ప్రజలపై భారాలు పెరిగాయి, పెట్రోల్ ధరలు, జీవన వ్యయాలు అన్నీ పెరిగిపోయాయి.
ప్రజల ఆత్మగౌరవం కాపాడేది, కష్టపడే వర్గాలకు అండగా నిలిచేది ఒక్క బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే” అని తెలిపారు.

