Telugu

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి.టిపిసిసి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ గారి ఆధ్వర్యంలో బుధవారం వెంగళరావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ (టిఆర్ఎస్), ప్రస్తుతం భాజపా నాయకుడు కిలారి మనోహర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.రమేష్ గారు మనోహర్ గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర కమ్మనాయకులు పెద్ద ఎత్తున రమేష్ గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరామని పార్టీ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహాయ సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply