Telugu

విద్యార్థులు అంటే చిన్న చూప..

బహదూర్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ కుత్బుల్లాపూర్ మండలం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అక్టోబర్ 30న జరగనున్న రాష్ట్రవ్యాప్త SFI బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి భగత్ మాట్లాడుతూ — రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. మొత్తం ₹8000 కోట్లు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మరియు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గతం లో చేసిన హామీ మేరకు 1200 కోట్లు దసరా సందర్భంగా ₹300 కోట్లు, దీపావళి సందర్భంగా మరో ₹300 కోట్లు, నవంబర్ మొదటి వారం నాటికి ₹600 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కాలేజీలకు అందలేదని అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
అలాగే ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి, యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌, లా, బీటెక్‌ తదితర అన్ని కాలేజీలు విద్యార్థుల నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సంబంధం లేకుండా సర్టిఫికేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్య పరిష్కారం కానట్లయితే, ఎస్‌ఎఫ్‌ఐ మెడ్చల్ జిల్లా భవిష్యత్తులో మరింత భారీ స్థాయిలో ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సాయి, అర్షద్, రోహిత్, సమీర్, షైభాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply