Latest NewsTelugu

అధికారుల సేవలు అభినందనీయం..
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

అధికారుల సేవలు అభినందనీయం..
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ghmc మూసాపేట సర్కిల్ 23 ఉప కమిషనర్ రమేష్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మల్లేశ్వర్రావు లు ఈనెల 31 న పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో వారినీ శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఉద్యోగ జీవితం నుంచి విరమణ పొందినప్పటికీ సామాజిక సేవలను కొనసాగించాలని , ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కుటుంబానికి అధిక సమయం కేటాయించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఉప కమిషనర్ కృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ బాబురావు, బీ ఆర్ ఎస్ నాయకులు ప్రభాకర్ తదితరులు అధికారులను సన్మానిచ్చారు..