Latest NewsTelugu

తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.

అల్లాపూర్ డివిజన్లో మంచినీరు డ్రైనేజీ సమస్యలతో పాటుగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ ప్రజల సమస్యల పైన స్థానిక కార్పొరేటర్ సబిహ గౌసుద్దిన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్యలు ఉన్నాయని అదేవిధంగా హైడ్రా పేరుతో రాజీవ్ గాంధీ నగర్ , సఫ్దార్ నగర్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా నివాసాలు ఉంటున్న ఇండ్లపై చేసే అపోహలను లెక్కచేయవద్దని రాజీవ్ గాంధీ నగర్ , సఫ్దర్ నగర్ ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని అన్నారు. నివాసాలు ఉంటున్న నిరుపేదల జోలికి వస్తే తాను అండగా నిలబడతానని అందరూ ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్, ఐలయ్య, వీరారెడ్డి, బాబా, పలు కాలనీ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.