కూకట్పల్లి నియోజక వర్గం అల్లాపూర్ 116 డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌస్ ఉద్దీన్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లాపూర్ డివిజన్ సీనియర్ సిటిజన్ మహిళలకు, మరియు అంగన్వాడీ టీచర్సకు ఆయాలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ, ఘనంగా సన్మానించడం జరిగింది. సమాజానికి సేవలందిస్తున్న సీనియర్ సిటిజన్స్, అంగన్వాడి టీచర్లు మరియు ఆలయాలకు శాలువా వేసి గౌరవించి, వారికీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారుల సంరక్షణ, విద్యాభివృద్ధిలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, సీనియర్ సిటిజన్స్, జుబేర్, ఆల్షాన్, విట్టలయ్య, జ్ఞానేశ్వర్, యోగిరాజు తదితరులు పాల్గొన్నారు.