
మేడ్చల్ జిల్లా 22 : ఫతేనగర్ డివిజన్ అమృత్ నగర్ తండావాసుల 40 ఏళ్ల స్వప్నం సాకారం కాబోతుంది. ఇక్కడ నివసిస్తున్న ఎస్ సి, ఎస్ టీ నివాసితులకు పట్టాలు మంజూరు చేసి కైతలాపూర్ దగ్గర్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వ నుంచి బుధవారం శుభవార్త అందింది దీంతో ఈ తండావాసుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది ప్రజాసమస్యల పరిష్కారంలో భాగంగా గత నవంబర్లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ గారు ఈ తండాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు తండావాసులు తాము ఇక్కడ 40 ఏళ్లుగా ఉంటున్నామని ఎలాంటి సౌకర్యాలు లేవని రోడ్లు తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రమేష్ గారి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఆయన ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి మరియు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు .దీనిపై వారు ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. దీంతో అధికారులు తండావాసులకు డబుల్ బెడ్ ఇళ్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇళ్లలో చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సి ఉందని వాటిని పూర్తి చేసిన వెంటనే వాసులను ఇక్కడికి తరలించి వారికి అవసరమైన ధ్రువపత్రాలను అందజేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. తమ సమస్యను ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వం దృష్టికి స్థానిక శాసనసభ్యుడికి చెప్పుకున్నా ఎలాంటి స్పందన లేదని తమ బస్తీని సందర్శించిన కేవలం రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ గారు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపజేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించడం చాలా ఆనందంగా ఉందని తండావాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఫతేనగర్ డివిజన్ ప్రెసిడెంట్ కుక్కల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హమీద్, శివ చౌదరి, అయాజ్ తదితరులు పాల్గొన్నారు.