మేడ్చల్ జిల్లా ఫిబ్రవరి 16 :- రోజు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు అశ్రయ్ కన్వెన్షన్ లో నిర్వహించిన Mega Kids School ప్రిన్సిపల్ సుచిత్ర పాటిల్, చైర్మన్ శ్రీ రఘువీర్ నాథ్ గార్ల ఆహ్వానం మేరకు అన్యువల్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొని సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. పాఠశాలలు పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తాయని, మంచి విలువలు మరియు క్రమశిక్షణతో ఎదిగితే వారు రేపటి సమాజానికి ఆదర్శప్రాయులవుతారని తెలిపారు.
పిల్లల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయని, వారికి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై విశ్వాసం ఉంచి, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author