Medchal జిల్లా 17: అల్లాపూర్ డివిజన్ పండిట్ నెహ్రు నగర్ లో అబ్దుల్ సలీం ఆహ్వానం మేరకు మౌలా బాబా దర్గా సందల్ ను టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గారు జనవరి 16 శుక్రవారం రాత్రి సందర్శించారు. దర్గా ఆర్గనైజర్ పటాన్ బర్కత్ అలీ ఖాన్ రమేష్ గారికి పూలమాలవేసి శాలువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రమేష్ గారునిర్వాహకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారిని అభినందించారు. అక్కడ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ షఫీ, షేక్ ఇమ్రాన్, మొహమ్మ సుల్తాన్, మొహమ్మద్ కరీం,అడ్డు భాయ్, మహమ్మద్ ఇలియాజ్, సయ్యద్ ఇమ్రాన్, మార్టిన్, హైదర్ భాయ్ మరియు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About The Author