మేడ్చల్ జిల్లా ఫిబ్రవరి 16:- కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ నందు శ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 287 జయంతి ఉత్సవాల సందర్భంగా సేవాలాల్ నగర్ లో కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ యొక్క సేవలను కొనియాడుతూ ఆయన మార్గంలో అందరం కూడా పయనించి వారి యొక్క ఆశయాలను పాటించాలని అందరు సన్మార్గంలో నడవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ జయంతి ఉత్సవాల అధ్యక్షుడు సభావత్ శంకర్ కూకట్పల్లి నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు శ్రీమతి పగడాల శిరీష బాబురావు పండాల సతీష్ గౌడ్ సబియా బేగం తూము శ్రావణ్ కుమార్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా డివిజన్ అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ గౌడ్ అంబటి శ్రీనివాస్ కైలా భీమ్రావు గడ్డం శ్రీనివాస్ యాదయ్య గౌడ్ కృష్ణ లలిత అనిత కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

About The Author